ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 4:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పెద్ద చెరువు మొదటి తూము వద్ద భారీ గొయ్యికి తాత్కాలిక మరమ్మతులు

పెద్ద చెరువు మొదటి తూము వద్ద భారీ గొయ్యికి తాత్కాలిక మరమ్మతులు .

అర్జున్ సమాచార్ కథనానికి స్పందించిన అధికారులు.. పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.5 లక్షలు మంజూరు.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17: మంథని మండలంలోని పెద్ద చెరువు మొదటి తూము పక్కన భారీ గొయ్యి ఏర్పడిన విషయాన్ని గ్రామ ఉపసర్పంచ్ ఎల్క లక్ష్మీరెడ్డి, పౌర సమాచార సంక్షేమ సంఘం మంథని నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎల్క సదానందం, బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్‌లు అర్జున్ సమాచార్ దినపత్రిక దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అర్జున్ సమాచార్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం అధికారులు అక్కడికి చేరుకుని భారీగా ఏర్పడిన గొయ్యిని తాత్కాలికంగా పూడ్చివేశారు. పంట కాలం ముగిసిన అనంతరం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఈ పనులకు సంబంధించి రూ.5 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన అర్జున్ సమాచార్ పాత్రికేయులకు, స్పందించిన సంబంధిత అధికారులకు గ్రామ ఉపసర్పంచ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, బీజేపీ మండల అధ్యక్షుడు, గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.